- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకర్ రిలీజ్ డేడ్ ఫిక్స్.. సాలిడ్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్
చార్మింగ్ స్టార్ శర్వా నంద్ తన 36వ చిత్రం ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా నంద్ తన 36వ చిత్రం ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. సినీ లవర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బైకర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దీనిపై తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ సాలిడ్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘రోడ్లు అండ్ అవకాశాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. మీరు పూర్తి వేగంతో దూసుకుపోతారు.. బైకర్ ఫస్ట్ ల్యాప్ - ది గ్లింప్స్ ఇప్పుడే మీ ముందుకు వచ్చింది.. డిసెంబర్ 6న బైకర్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది’ అని చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా నంద్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. హై-ఎనర్జీ స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. లింక్
- Tags
- Sharwanand
- Biker






