- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sharwanand: రాజశేఖర్ గారు అలాంటివారు.. ప్రశంసలతో ముంచెత్తాడు
ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకున్న శర్వానంద్... రాజశేఖర్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా ‘బైకర్’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటించగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు రాజశేఖర్ ఇందులో కీలకమైన పాత్రలో కనిపించాడు. ఈ మూవీ ఈరోజు విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో భాగంగా శర్వానంద్, రాజశేఖర్ గురించి ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
శర్వానంద్ మాట్లాడుతూ… రాజశేఖర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఎంతో సింప్లిసిటీ కలిగిన మనిషి అని, సెట్‌లోకి ఎవరు వచ్చినా లేచి నిలబడి వారికి నమస్కారం పెట్టే గొప్ప గుణం ఆయనదని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ… “నేను పిలిస్తే రావలసిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు. ఆయన ఒక గొప్ప లెజెండ్ యాక్టర్. అయినప్పటికీ నాకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. మీలాంటి వారిని నేను ఎక్కడా చూడలేదు. ‘బైకర్’ చిత్రంలో ఆయన నాకు తండ్రిగా నటించారు.
నిజ జీవితంలో కూడా ఆయన నాకు తండ్రితో సమానం” అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్ మాట్లాడుతూ… “నిన్న నేను మా అమ్మాయిలతో కలిసి సినిమా చూశాను. ఆ సమయంలో మా మధ్య చిన్న డిస్కషన్ వచ్చింది. దాంతో నేను సరదాగా — నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను — అని అన్నాను” అంటూ శర్వానంద్ గురించి ప్రేమగా చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు నటులు ఒకరిపై ఒకరు చూపించిన అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను ఆకట్టుకుంటోంది.






