- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి నాకు ఓ స్లాట్ ఉండాల్సిందే..శర్వానంద్ సంచలనం !
మొన్న రిలీజ్ అయిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా తెలుగు సినిమాలు సందడి చేశాయి. ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు చేసిన మొత్తం ఐదు తెలుగు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు సైడ్ కాగా, తెలుగు సినిమాలు మాత్రం ఈ సంక్రాంతికి మంచి ఊపు తీసుకొచ్చాయి. ఇందులో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఉంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన అంటే రెండు రోజుల కిందట రిలీజ్ అయింది. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కంప్లీట్ కామెడీ ట్రాక్ లో నడుస్తుందట. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా ఉన్నారు.
నాకు ఒక స్లాట్ ఉండాల్సిందే
మొన్న రిలీజ్ అయిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంక్రాంతికి నేను రావాలి.. అప్పుడే అన్ని సినిమాలు ఆడుతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయని గుర్తు చేశారు.
ఆ సమయంలో తనతో పాటు మరో నలుగురు హీరోల సినిమాలు వచ్చినా కూడా అన్ని హిట్ అయినట్లు స్పష్టం చేశారు. ఈ సారి ‘నారీ నారీ నడుమ మురారి’తో నేను వచ్చాను. తన సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. అయినప్పటికీ ఈసారి సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అయినట్లు వెల్లడించారు. అందుకే ప్రతి సంక్రాంతికి నేను వస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయని.. నాకు ఒక స్లాట్ ఉండాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శర్వానంద్.






