- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bollywood: డాన్ 3లో హీరోయిన్‌గా శార్వరీ వాగ్?
బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'డాన్' ఫ్రాంచైజీలో తాజాగా రూపొందుతున్న చిత్రం డాన్ 3.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ (Bollywood) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'డాన్ (Don)' ఫ్రాంచైజీలో తాజాగా రూపొందుతున్న చిత్రం డాన్ 3. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) తెరకెక్కించనున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ నటించిన డాన్ (2006), డాన్ 2 (2011) చిత్రాలకు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని (Kiara advani) చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కియారా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కియారా స్థానంలో హీరోయిన్‌గా శార్వరీ వాగ్ (Sharvari wagh) నటించబోతున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
శార్వరీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉంది. గతేడాది ముంజా (Munjya) అనే హారర్-కామెడీ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ, బిజీ బిజీగా మారింది. మహారాజ్, వేదా వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇటీవల ఆలియా భట్ (Alia Bhatt), బాబీ డియోల్ (Bobby Deol) లీడ్ రోల్స్‌లో నటించిన ఆల్ఫా (Alpha)లో నటించింది.






