- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షారుఖా.. ఎవరు?.. బాలీవుడ్ బాద్ షాకు ఘోర అవమానం!
బాలీవుడ్ బాద్ షాకు ఘోర అవమానం జరిగింది. అమెరికా వేదికగా జరిగిన మెటా గాలాలో యాంకర్లు ఆయన్ను గుర్తుపట్టలేదు.

దిశ, వెబ్ సైట్: బాలీవుడ్ బాద్ షాకు ఘోర అవమానం జరిగింది. అమెరికా వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన్ను యాంకర్లు గుర్తించలేదు. దీంతో ఆయన తాను ఎవరనే విషయం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లోగల మెట్రోపాలిటన్ మ్యూజియంలో సోమవారం రాత్రి మెట్ గాలా పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారత ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీతో కలిసి వచ్చిన షారుఖ్ ను అక్కడి యాంకర్లు తొలుత గుర్తుపట్టలేదు. షారుఖ్ ను ఫ్యాషన్ డిజైనర్ గానే భావించి పలుకరించారు. వారి వేషధారణ గురించి మాట్లాడారే తప్ప షారుఖ్‌ను గుర్తుపట్టలేదు. పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఎలా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆయన ఏం చెప్పాలో తెలియక.. మా పిల్లలు నన్ను గ్రేట్ డాడ్ అని అనుకుంటారేమోనని అసహనంగా చెప్పాడు. ఇక లాభం లేదనుకుని సవ్యసాచి ముఖర్జీ మైక్ తీసుకుని.. ఈయన షారుఖ్ ఖాన్ ఇండియన్ ఫేమస్ యాక్టర్. ఈయన కోసం తాము దిగిన హోటల్ బయట ఫొటోలు దిగేందుకు పెద్ద తోపులాటే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారంటూ గడగడా చెప్పేశాడు. అయితే, తామేదో తప్పు చేశామని యాంకర్లు ఫేస్ పెట్టారే తప్ప ఆయన్ను గుర్తు పట్టలేదు. దీంతో నిర్వాహకుల తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించే ముందు గెస్టులు ఎవరెవరు వస్తున్నారనే విషయంపై కనీసం హోమ్ వర్క్ చేసుకోవాలని తెలియదా? అని మండిపడుతున్నారు. ఇంతకుముందే ఒకసారి షారుఖ్ ఖాన్ ను అమెరికాలోని ఓ విమానాశ్రయంలో బట్టలు విప్పి చెక్ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మరోసారి అవమానం జరగడంపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మెరిసిన ఈషా అంబానీ, ప్రియాంక
భారత్ నుంచి ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ, బాలీవుడ్ గాయకుడు, నటుడు దిల్జీత్ దొసాంజ్, బాలీవుడ్ నటి కియా అద్వారా, బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా ఆమె భర్త నిక్ జోనస్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్, పాప్ సింగర్ రిహన్నా సహా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన వ్యాపారవేత్తలు, క్రీడాకారులు భారీ ఎత్తున హాజరయ్యారు. బిగ్ నైట్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కాస్ట్యూమ్ డిజైనర్లు తాము రూపొందించిన బెస్ట్ డిజైన్లను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ డిజైనర్లను పండుగలాంటిది. ఈ ఫ్యాషన్ కార్యక్రమంలో పాల్గొనడం అంత సులభం కూడా కాదు.. ఒక టికెట్ ఖరీదు 75వేల డాలర్లు. భారత కరెన్సీలో రూ.63లక్షలుపైనే.. ఇంత డబ్బు పెట్టి మరీ షారుఖ్ అవమానపడటం సో పిటీ అంటూ నెటిజన్లు వాపోతున్నారు.






