- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీ అవార్డుల వేడుకలో శంకర్ మహదేవన్‌కు నామినీ మెడల్
లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రీ-గ్రామీ నామినీల రిసెప్షన్‌లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దిశ, వెబ్‌డెస్క్: లాస్ ఏంజిలెస్‌లో జరిగిన ప్రీ-గ్రామీ నామినీల రిసెప్షన్‌లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2026 గ్రామీ అవార్డుల వేడుకకు ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని.. నామినీ మెడల్‌ను స్వీకరించిన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఫోటోలతో పాటు “ప్రీ-గ్రామీ నామినీ రిసెప్షన్ పార్టీలో పాల్గొన్నాను. నామినీ మెడల్ అందుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులతో కలిసి గడపడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ శంకర్ మహదేవన్ పోస్టులో పేర్కొన్నారు.
ఫ్యూజన్ బ్యాండ్ Shaktiతో కలిసి ఆయనకు ఈసారి రెండు గ్రామీ నామినేషన్లు రావడం విశేషం. వారి తాజా ఆల్బమ్ Mind Explosion ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ విభాగంలో నామినేట్ కాగా, Shrini’s Dream పాట ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ కేటగిరీలో పోటీ పడుతోంది. ఈ నామినేషన్లను శంకర్ మహదేవన్ దివంగత తబలా దిగ్గజం Zakir Hussainకు అంకితం చేశారు. ఆయన మరణానంతరం శక్తి బ్యాండ్‌కు నాయకత్వం వహిస్తూ, వారి సంగీత వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో కొనసాగిస్తున్నారు.
నామినీ మెడల్ అందుకున్న సమయంలో తన స్పందనను వీడియో రూపంలో కూడా శంకర్ పంచుకున్నారు. రాబోయే అవార్డుల వేడుకపై ఉత్సాహం, ఆశాభావం వ్యక్తం చేశారు. “రెండు గ్రామీ నామినేషన్లు.. నా ప్రియమైన గురువులతో కలిసి అవార్డుల వేడుక కోసం ఎదురుచూస్తున్నాను. ఫింగర్స్ క్రాస్డ్” అని అభిమానులకు సందేశం పంపారు.
ఇదివరకే 2024లో శంకర్ మహదేవన్, శక్తి బ్యాండ్‌తో కలిసి This Moment ఆల్బమ్‌కు గాను ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ అవార్డు అందుకున్నారు. అది ఆయన అంతర్జాతీయ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. తాజా నామినేషన్లతో మరోసారి శంకర్ మహదేవన్ అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. లాస్ ఏంజిలెస్‌లో జరిగిన ఈ వేడుక వివిధ దేశాల సంగీతకారులను ఒకేచోట చేర్చి, పరస్పర సహకారం, నెట్‌వర్కింగ్‌కు వేదికగా నిలిచింది.






