Allu Arjun: ఓ వైపు అవమానం .. ఇంకోవైపు సన్మానం.. ఐకాన్ స్టార్ కు నష్టమా? లాభమా?

by Prasanna |
Allu Arjun: ఓ వైపు అవమానం .. ఇంకోవైపు సన్మానం.. ఐకాన్ స్టార్ కు నష్టమా? లాభమా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ( Allu Arjun) అరెస్ట్‌ ను చూసి షాక్ అవుతున్నారు. కొందరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి కొందరు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు పుష్ప 2 సినిమా రోజుకో రికార్డు బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి హౌస్ ఫుల్ గా మూవీ రన్ అవుతుంది.

బన్నీ అరెస్ట్ ఎంతో అవమానంగా ఉందంటూ సినీ వర్గాల వారు కూడా మండిపడుతున్నారు. ఇంకో వైపు అరెస్ట్ చేసిన అది అల్లు అర్జున్ కే ప్లస్ .. దీని వలన తెలియని వారికీ కూడా తెలుస్తాడు, 'పుష్ప2' ( Pushpa 2) కి పబ్లిసిటీ దక్కిందని, దాంతో పాటు సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్, పోలీసులకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి, అరెస్టుతో అల్లు అర్జున్ కి జరిగిన నష్టమేమి లేదు.. ఇది ఆయనకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed