శంబాల హిందీ ట్రైలర్ రిలీజ్..

by I. Sairam |

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్(Adi Sai Kumar) తాజాగా నటించిన ‘శంబాల’(Shamabala) మూవీ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 25న విడుదలై ఈ మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

శంబాల హిందీ ట్రైలర్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్(Adi Sai Kumar) తాజాగా నటించిన ‘శంబాల’(Shamabala) మూవీ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 25న విడుదలై ఈ మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ‘శంబాల’ హిందీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

తెలుగు నటులు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరిస్తున్న తరుణంలో ఆది కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ సినిమా హిందీలో జనవరి 9న రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివ కార్తీక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు.


Next Story