శంబాలలో ఫేమస్ నటి.. వణుకు పుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-02-08 13:12:54  IST  )

విభిన్న చిత్రాల్లో నటిస్తున్న ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala).

శంబాలలో ఫేమస్ నటి.. వణుకు పుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: విభిన్న చిత్రాల్లో నటిస్తున్న ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ఈ చిత్రానికి యుగంధర్ ముని (Director Yugandhar Muni) దర్శకత్వం వహిస్తుండగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌’ (Shambala: A Mystical World)అంటూ రాబోతోన్న ఈ మూవీలో అర్చన అయ్యర్(Archana Iyer) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన హీరో స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, వింటేజ్ మేకోవర్ అదిరిపోగా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పొలం.. దిష్టి బొమ్మ హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరో పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో ‘వివేకనందన్ విరలను’ అనే మలయాళం చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న స్వాసిక(Swasika) కీలక పాత్రలో నటిస్తుంది.

తాజాగా ఈ నటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి మరింత క్యూరియాసిటీని పెంచేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో ముఖానికి బొట్టు లేకుండా ఎర్ర చీరలో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఇక బ్యాక్ గ్రౌండ్‌లో సేమ్ దిస్టి బొమ్మ, కాకులు, చీకటిలో పొలం చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ చూసినట్టు అయితే.. ఆ దిష్టి బొమ్మ, పొలం కామన్ చూపిస్తున్నారు. దీంతో అసలు ‘శంబాల’ కథ ఏంటీ అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది. కాగా.. ఈ చిత్రంలో స్వాసికతో పాటు రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

Next Story