Shah Rukh Khan: సీక్రెట్ డైట్ రివీల్ చేసిన షారుఖ్ ఖాన్.. షాక్‌లో నెటిజన్లు

by Kodari Anjali |

షారుఖ్ ఖాన్ తన సూపర్ ఫిట్ అవతార్ అండ్ సిక్స్ ప్యాక్ అబ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారన్న విషయం తెలిసిందే.

Shah Rukh Khan: సీక్రెట్ డైట్ రివీల్ చేసిన షారుఖ్ ఖాన్.. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: షారుఖ్ ఖాన్ తన సూపర్ ఫిట్ అవతార్ అండ్ సిక్స్ ప్యాక్ అబ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా‘పఠాన్’ లో తన సూపర్ ఫిట్ అవతార్, సిక్స్ ప్యాక్ అబ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నటుడు 59 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్‌గా ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు. షారుఖ్ లుక్స్ అతని వయస్సును పూర్తిగా తరచూ జనాల్ని ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. అయితే తాజాగా తాను ఏమి తింటానో, ఏమి తినను అనే వివరాల్ని తాజాగా వెల్లడించారు.

‘‘సహజంగానే చాలా వరకు ప్రాథమిక ఆహారం వైపు మొగ్గు చూపుతాను. నేను ప్రతిరోజూ రెండు ప్రధాన భోజనాలకు కట్టుబడి ఉంటాను. భోజనం, రాత్రి భోజనం. ఇవి కాకుండా, నేను చిరుతిండి లేదా మరేమీ తినను. నాకు విలాసవంతమైన లేదా విస్తృతమైన వంటకాలు (ముఝే పక్వాన్ పసంద్ నహి) ఇష్టం ఉండదు. నా భోజనంలో సాధారణంగా మొలకలు, గ్రిల్డ్ చికెన్, బ్రోకలీ, అప్పుడప్పుడు పప్పు తింటాను అంతే.

నేను చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇలాగే ఎక్కువ వైవిధ్యం లేకుండా తింటున్నానని వెల్లడించారు. నేను విమానంలో ప్రయాణిస్తుంటే, లేదా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేస్తుంటే, వారు దయతో వడ్డించేది ఏదైనా ఇష్టంగా తింటాను. అది బిర్యానీ, రోటీ, పరాఠాలు, నెయ్యితో వండిన ఆహారం లేదా ఒక గ్లాసు లస్సీ అయినా. ఇతరులతో భోజనం పంచుకునే విషయంలో నేను నన్ను నేను పరిమితం చేసుకోను’’ అని షారుఖ్ ఖాన్ వెల్లడించారు. షారుఖ్ కామెంట్లు విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ డైట్ మెయింటైన్ చేస్తూ.. ఈ రేంజ్ ఫిజిక్ ఎలా సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story