- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టినరోజు వేళ అభిమానులకు క్షమాపణలు చెప్పిన షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టారో హీరో అయిన షారుక్ ఖాన్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది అభిమానులో తరలి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టారో హీరో అయిన షారుక్ ఖాన్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది అభిమానులో తరలి వచ్చారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన తన అభిమానులతో సమావేశం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో జనసమూహ నియంత్రణ కారణంగా సమావేశం రద్దు అయింది. దీంతో తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను పలకరించ లేకపోయినందుకు షారుక్ ఖాన్ హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశాడు.
అందులో.. "మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు. కానీ ఇది మీ అందరి భద్రత కోసం తీసుకున్న నిర్ణయం అని నాకు తెలియజేశారు. అని ఖాన్ రాసుకొచ్చాడు. ఇదే ట్వీట్‌లో "అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేసిన ఆయన, “మీరు చూపిస్తున్న ఆప్యాయత, నమ్మకం నాకు అత్యంత విలువైనవి. నేను మిమ్మల్ని చూడలేకపోయినా, మీ కంటే ఎక్కువగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. త్వరలో మీ అందరినీ కలుపుకొని నా ప్రేమను వ్యక్తం చేయాలని ఎదురుచూస్తున్నాను,” అని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను కదిలిస్తోంది.






