- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శబ్దం’ టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉంటుంది.. ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో ఆదిపిని శెట్టి(Adi Pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘శబ్దం’(Shabdam) సినిమాలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో ఆదిపిని శెట్టి(Adi Pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘శబ్దం’(Shabdam) సినిమాలో నటిస్తున్నాడు. దీనికి అరివఝాగన్(Arivazhagan) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇది 2009లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘వైశాలి’(Vaishali)కి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 7జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్(Trailer) సోషల్ మీడియా(Social Media)లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి ఈ చిత్రం పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘శబ్దం మంచి కథా బలం ఎమోషన్ ఉన్న హారర్ సినిమా. రెగ్యులర్ చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆత్మలని ఒక సైంటిఫిక్ మెథడ్‌లో అన్వేషించే విధానం చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది.
స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు తీయడం కూడా కష్టమే. ఇలాంటి వరల్డ్‌ని ఇంతక ముందు ఎవరూ చూపించలేదు. హారర్ సినిమాల్లో వైశాలి ఎంత డిఫరెంట్ సినిమానో శబ్దం కూడా అంత డిఫరెంట్‌గా స్పెషల్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా ఈ మూవీ చాలా రిచ్‌గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆది చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






