- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ సాంగ్ కాపీరైట్ కేసులో కీలక తీర్పు
ఇళయరాజా క్లాసిక్ సాంగ్ ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ కాపీరైట్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సంగీత మాంత్రికుడు ఇళయరాజా (Ilaiyaraaj)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కంపోజ్ చేసిన క్లాసిక్ హిట్ సాంగ్ ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ కాపీరైట్ వివాదంలో ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ పాటపై మ్యూజిక్ లేబుల్ ‘ఇకో రికార్డింగ్స్’ (ECHO Recordings) సంస్థకు ఉన్న హక్కులను కోర్టు సమర్థించింది. అయితే, 1980ల నాటి బ్లాక్‌బస్టర్ తమిళ చిత్రం ‘మూడు పాని’ (Moodu Pani) లోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ హక్కులకు సంబంధించి ఇళయరాజా, ఇకో రికార్డింగ్స్ సంస్థల మధ్య చాలాకాలంగా పంచాయతీ నడుస్తోంది. తన పర్మీషన్ లేకుండా ఆ పాటను వాడటంపై ఇళయరాజా గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసును గతంలో విచారించిన సింగిల్ జడ్జి బెంచ్, సదరు మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దానిని ఇళయరాజా సవాలు చేస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwanth Varma), జస్టిస్ రవీందర్ దుడేజా (Justice Ravinder Dudeja)లతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన పాత తీర్పునే సమర్థించింది. నిర్మాతల నుండి చట్టబద్ధమైన ఒప్పందాల ద్వారా ఆడియో హక్కులను పొందినందున, ఆ పాటల వాణిజ్యపరమైన వినియోగంపై ఇకో రికార్డింగ్స్ సంస్థకే సర్వహక్కులు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజాకు ఉన్న హక్కులు, సదరు మ్యూజిక్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పంద పరిమితులకు లోబడే ఉంటాయని కోర్టు కోర్టు తెలిపింది.






