సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్‌ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2025-07-16 16:04:33  IST  )

45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందింది ‘ఆ గ్యాంగ్‌ రేపు’ షార్ట్ ఫిలిమ్.

సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్‌ రిలీజ్
X

దిశ, సినిమా: 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందింది ‘ఆ గ్యాంగ్‌ రేపు’ షార్ట్ ఫిలిమ్. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందడంతో దీనికి స్వీకెల్‌గా ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ రూపొందించారు. ఇప్పుడు ఈ ప్రాంచైజీలో మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ తెరకెక్కించారు. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మింస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించబడనున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే తాజాగా ఈ షార్ట్ ఫిలిమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘2015లో అనుకోకుండా నాకున్న చిన్న ప్రయత్నం వైరల్‌ అయిపోయి గుర్తింపు తెచ్చింది. గ్యాంగ్‌ రేపు 2 కూడా హిట్‌ అయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశాడు. ఆ గ్యాంగ్‌ రేపు 3 టైటిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. నిర్మాత నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోచేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందర్ని అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఆటా సందీప్‌ ఆ గ్యాంగ్‌ రేప్‌, గ్యాంగ్‌ రేప్‌ 2లో చేశాడు. కానీ ఈ సినిమాలో ఆయనను విలన్‌గా చేపించడం ఇష్టం లేదు అందుకే చేయించలేదు. అందుకే కొత్తవాళ్లతో చేశాను’ అన్నారు.

Next Story