- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినిమా బతకాలంటే అదొక్కటే మార్గం.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ప్రముఖ నిర్మాత KS రామారావు(KS Rama Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ప్రముఖ నిర్మాత KS రామారావు(KS Rama Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం యువ హీరో అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో వస్తోన్న వచ్చినవాడు గౌతం సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలను ఓటీటీల్లో(OTTs) చూడటం ప్రజలు మానేయాలని కోరారు. సినిమాలు తీసేదే ప్రజలు థియేటర్(Theater)కు వచ్చి చూడటానికి అని తెలిపారు. థియేటర్లు బతకాలన్నా, ఇండస్ట్రీ బాగుండాలన్నా సినిమాలు అన్నీ థియేటర్లలో చూడాలని అభిప్రాయపడ్డారు. వాటాల విధానంలో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని అన్నారు. పర్సంటేజీ విధానానికి మైత్రీ సంస్థ కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover) వంటి సినిమాలను నిర్మించారు. కౌసల్య కృష్ణమూర్తి పర్వాలేదు అనిపించగా, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్‌గా మిగిలింది. నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.






