- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత స్త్రీలు సెక్స్ చేసేది అందుకోసం కాదు.. సీనియర్ నటి బోల్డ్ కామెంట్స్..
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా బోల్డ్ లైఫ్, బోల్డ్ స్టేట్మెంట్స్ ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటాయి. 80ల నుంచి ఇప్పటి వరకు ఏ ఫేజ్‌లోనూ తగ్గని భామ సారీ సారీ బామ్మ.. సొసైటీ ఒప్పుకుంటుందా లేదా అనే ఆలోచన లేకుండా ఓ క్రికెటర్‌తో సహజీవనం చేసింది. బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా బోల్డ్ లైఫ్, బోల్డ్ స్టేట్మెంట్స్ ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటాయి. 80ల నుంచి ఇప్పటి వరకు ఏ ఫేజ్‌లోనూ తగ్గని భామ సారీ సారీ బామ్మ.. సొసైటీ ఒప్పుకుంటుందా లేదా అనే ఆలోచన లేకుండా ఓ క్రికెటర్‌తో సహజీవనం చేసింది. బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సింగిల్ మదర్‌గానే పాపకు అన్నీ సమకూర్చింది. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. అయితే మీడియాతో ఏం మాట్లాడిన బోల్డ్‌గానే మాట్లాడే నీనా గుప్తా.. తాజాగా సెక్స్ గురించి కామెంట్స్ చేసింది. బారతదేశంలోని దాదాపు 95శాతం మంది మహిళలు శృంగారం అనేది ఎంజాయ్మెంట్ కోసమనేది కూడా తెలియదని చెప్పింది. భర్తతో గడిపితే పిల్లలను కనొచ్చనే భావన మాత్రమే స్త్రీలకు ఉంటుందని.. ప్లెజర్ కోరుకుని సాన్నిహిత్యంగా ఉండటం చాలా రేర్ అని తెలిపింది.
ఇక సెక్స్‌పై బాలీవుడ్ సినిమాల ప్రభావం గురించి మాట్లాడిన నీనా.. శృంగారం గురించిన ఆలోచనను మూవీస్ మార్చేశాయని తెలిపింది. ‘‘ సినిమాలు ఏం చూపిస్తాయి. స్త్రీ మోటో పురుషుడి గురించి వెతకడం మాత్రమే. చాలా రోజుల వరకు ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడుతారనే భ్రమలో బతికా. చిత్రాల్లో అదే చూపించారు కదా’’ అని తెలిపింది. ఇక దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ‘‘నిజంగానే మీరు భ్రమలో బతుకుతున్నారు. శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయని గుర్తించట్లేదా’’ అంటున్నారు.






