- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ పాల రంగు శరీరంతో ఎవరిని నిద్ర పుచ్చుతున్నావ్.. తమన్నాపై 69ఏళ్ల సీనియర్ నటుడి వల్గర్ కామెంట్స్
మిల్కీ బ్యూటీ తమన్నాపై వల్గర్ కామెంట్స్ చేశాడు సీనియర్ నటుడు అను కపూర్. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడటం తగదంటూ నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటున్నాడు. ‘స్త్రీ 2’ మూవీలో ‘ఆజ్ కీ రాత్’ పాట గురించి గత

దిశ, వెబ్ డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నాపై వల్గర్ కామెంట్స్ చేశాడు సీనియర్ నటుడు అను కపూర్. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడటం తగదంటూ నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటున్నాడు. ‘స్త్రీ 2’ మూవీలో ‘ఆజ్ కీ రాత్’ పాట గురించి గత ఇంటర్వ్యూలో.. తన పాట పెడితే చిన్న పిల్లలు అన్నం తింటారని, నిద్రపోతారని చెప్పింది తమన్నా. ఈ కామెంట్స్‌ను ఇక్కడ ప్రస్తావించి మరీ నీచంగా మాట్లాడాడు. ‘ఓ మై గాడ్.. ఎంత అద్భుతమైన పాల రంగు శరీరం’ అంటూ సెటైర్స్ వేసుకుంటూ వచ్చాడు.
‘ఏ వయసు పిల్లలకు నిద్ర పుచ్చుతావు నీ పాటతో.. 70 ఏళ్ల ముసలోళ్లు కూడా పిల్లలే కదా.. నేను ఉంటే అడిగేవాడని..’ అంటూ సర్కాస్టిక్‌గా చెప్పాడు. అలాగే కంటిన్యూ చేస్తూ.. ‘ సోదరి.. నీ పాటతో.. నీ శరీరంతో.. నీ మెరిసే పాల రంగు ముఖంతో మా పిల్లలు నిద్ర పోతున్నారు.. మా పిల్లలు మంచి, ఆరోగ్యకరమైన నిద్ర పొందితే గొప్ప దీవెనే. మరిన్ని కోరికలు ఉంటే భగవంతుడు ఆ సామర్థ్యం ఇవ్వాలి’ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 69ఏళ్ల వయసులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా ఇంతకు ముందు కూడా అను కపూర్ గాంధీజీపై అసభ్యకర వ్యాఖ్యలతోపాటు పలు వివాదాల్లో తలదూర్చాడు.






