Murali Mohan: ‘సుప్రీమ్ వారియర్స్’తో రాబోతున్న సీనియర్ హీరో.. ఇందులో నటించడం ఆనందంగా ఉందంటూ కామెంట్

by Chukka Sudharani |

సీనియర్ నటుడు డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుప్రీమ్ వారియర్స్’.

Murali Mohan: ‘సుప్రీమ్ వారియర్స్’తో రాబోతున్న సీనియర్ హీరో.. ఇందులో నటించడం ఆనందంగా ఉందంటూ కామెంట్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుప్రీమ్ వారియర్స్’. ఆది అక్షర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పెదపూడి బాబూ రావు నిర్మిస్తుండగా.. హరి చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి దవళ సత్యం, బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీర శంకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శివ రాజ్ పాటిల్, మార్కాపురం శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘ఆది అక్షర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ‘సుప్రీమ్ వారియర్స్’ సినిమాను తాజాగా రామా నాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ మూవీ కథను డైరెక్టర్ హరి చందన్ చెప్పినప్పుడే నాకు ఎంతో నచ్చింది. ఈ మూవీలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇక నిర్మాత పెదపూడి బాబూ రావు నటుడిగా ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. ఈ ‘సుప్రీమ్ వారియర్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

Next Story