ఆస్పత్రి నుంచి సీనియర్ నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

by Malleboina Mahesh |

బాలీవుడ్ స్టార్ యాక్టర్ ధర్మేంద్ర చనిపోయాడంటూ నిన్న వచ్చిన ఫేక్ వార్తలను ఆయన కూతురు, భార్య హేమమాలిని కొట్టిపారేశారు.

ఆస్పత్రి నుంచి సీనియర్ నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ ధర్మేంద్ర (Actor Dharmendra) చనిపోయాడంటూ నిన్న వచ్చిన ఫేక్ వార్తలను ఆయన కూతురు, భార్య హేమమాలిని కొట్టిపారేశారు. అలాగే ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన మీడియా సంస్థలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ప్రస్తుతం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) చేసి ఇంటికి తీసుకెళ్లారు. నిపుణులైన వైద్యుల సహాయంతో ఇంటి వద్దనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికి చికిత్సను కంటిన్యూ చేస్తున్నారు. కాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారనే వార్తలతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకొని, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story