Seethamma Vakitlo Sirimalle Chettu: థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న పెద్దోడు- చిన్నోడు సినిమా.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-31 12:40:23  IST  )

2013లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Seethamma Vakitlo Sirimalle Chettu: థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న పెద్దోడు- చిన్నోడు సినిమా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: 2013లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), అంజలి(Anjali), సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో జయసుధ(Jayasudha), ప్రకాష్ రాజ్(Prakash Raj), రావు రమేష్(Rao Ramesh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. శ్రీకాంత్ అడ్డాల(srikanth addala) డైరెక్షన్ వహించిన ఈ మూవీని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాగా ఈ చిత్రం 2013లో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైనది. పెద్దోడు క్యారెక్టర్‌లో మన వెంకీ మామ, చిన్నోడు క్యారెక్టర్‌లో మహేష్ బాబు ఇరగదీశారనే చెప్పాలి. విమర్శకులను సైతం మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఫిబ్రవరిలో రీ రిలీజ్(Re Release) కానున్నట్లు తెలుస్తోంది. అయితే డేట్ మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) మూవీతో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే కలెక్షన్ల విషయంలోనూ సునామీ సృష్టిస్తున్నాడు. అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh), యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

అలాగే మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli)తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Next Story