కోసింది కొయగుర.. పండుగ స్పెషల్‌గా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

కోసింది కొయగుర.. పండుగ స్పెషల్‌గా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆనంది, రాగ్ మయూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గరివిడి లక్ష్మి’. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘నల జీలకర్ర మొగ్గ’కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ఉగాది పండుగా సందర్భంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు ‘పల్లె మట్టి పరిమళంతో జానపద రాగాలతో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఈ కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సవభరితంగా మార్చే ఒక ప్రకటన. గరివిడిలక్ష్మి రెండవ సింగిల్ కోసింది కొయగుర మార్చి 24న విడుదల కాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆనంది లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. 1990లలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలను, ముఖ్యంగా బుర్రకథను ప్రాచుర్యంలోకి తెచ్చిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Next Story