‘కింగ్డమ్’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. బ్రదర్ సెంటిమెంట్‌తో హార్ట్ టచ్ చేసేశారుగా..

by I. Sairam |   (  Updated:2025-07-17 06:23:48  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కింగ్డమ్’(Kingdom).

‘కింగ్డమ్’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. బ్రదర్ సెంటిమెంట్‌తో హార్ట్ టచ్ చేసేశారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కింగ్డమ్’(Kingdom). ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి(Gowtham Thinnanoori) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasre Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. హీరో సత్యదేవ్(Satyadev) కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక ఈ చిత్రం జూలై 31న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి సెకెండ్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రూతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. 'కింగ్‌డమ్' కోసం ‘అన్న అంటేనే’ అనే భావోద్వేగ గీతాన్ని స్వరపరచగా.. కృష్ణకాంత్‌ సాహిత్యాన్ని అందించారు. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇందులో విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ సోదరులుగా కనిపించారు. Link

Next Story