- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘8 వసంతాలు’ నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న హార్ట్ టచింగ్ లిరిక్స్
టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu). ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yarneni), వై రవి శంకర్(Y Ravi Shanker) నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో ‘మ్యాడ్’(Mad) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సునిల్ కుమార్(Ananthika Sunil Kumar) లీడ్ రోల్‌లో నటిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు టీజర్లను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్‌డేట్‌ను పంచుకుంది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్(Second Single)ను ప్రోమోను రిలీజ్ చేస్తూ.. ‘చిత్ర గారి చిరకాల స్వరం మరో మనోహరమైన శ్రావ్యతతో తిరిగి వచ్చింది.. 8వసంతలు రెండవ సింగిల్ పరిచయమిల ఈరోజు మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల కానుంది’ అని రాసుకొస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ లిరీక్స్ నెట్టింట ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.






