- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలల దినోత్సవం స్పెషల్‌గా ‘స్కూల్ లైఫ్’.. టికెట్ కేవలం వంద రూపాయలే అంటున్న డైరెక్టర్
బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’.

దిశ, సినిమా: బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రాబోతున్నది. సావిత్రి, షన్ను హీరోయిన్స్‌గా నటించగా.. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రను పోషించారు. రిలీజ్ సమయం దగ్గరపడటంతో తాజాగా ఇందులో నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమాలో కీలకపాత్రలు పోషించి, సినిమాకు ఎంతో సపోర్ట్ చేసిన సుమన్‌కి, ఆమనికి, మురళీధర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నాను. ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వచ్చాను. సినిమాలు బ్రతకాలి. అందుకే నేను ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో కొత్త వారి అందరికీ నా బ్యానర్ సపోర్ట్‌గా నిలుస్తుంది. సినిమాలలో హీరో కథ, బడ్జెట్ కాదు. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమాను పూర్తి చేసాము. ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ఒకప్పుడు కొత్త వారే. మా సినిమా టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉండబోతుంది’ అని తెలిపారు.
- Tags
- School Life






