- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Satya Dev: ఆ సినిమాను ఫ్లాప్ చేశారు.. అలా జరిగి ఉండకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది
బ్లఫ్ మాస్టర్' ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని సత్యదేవ్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: చిన్న స్థాయి నుంచి ఎదిగి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన 'రావు బహదూర్' చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సత్యదేవ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన 'బ్లఫ్ మాస్టర్' గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సత్యదేవ్ మాట్లాడుతూ, "షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ, సినిమా విడుదలకు ముందు కూడా 'బ్లఫ్ మాస్టర్' అద్భుతమైన విజయం సాధిస్తుందని మేమంతా భావించాం.
అయితే విడుదల తర్వాత ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అది నాకు చాలా నిరాశ కలిగించింది" అని చెప్పారు. అలాగే, "ఆ సినిమా విడుదలై దాదాపు ఆరు సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో 'బ్లఫ్ మాస్టర్'కు రావాల్సిన గుర్తింపు వచ్చి ఉంటే నా కెరీర్ మరింత మెరుగ్గా ఉండేదేమో అనిపించేది. కానీ ఆ తర్వాత జీవితంలో ఇలాంటి విషయాలు సహజమే అని నేర్చుకున్నాను" అని సత్యదేవ్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం 'రావు బహదూర్' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.






