Kingdom: విజయ్ దేవరకొండ సినిమాలో ఫేమస్ తెలుగు యాక్టర్.. బర్త్‌డే స్పెషల్‌గా పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి.

Kingdom: విజయ్ దేవరకొండ సినిమాలో ఫేమస్ తెలుగు యాక్టర్.. బర్త్‌డే స్పెషల్‌గా పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించే మరో నటుడిని రివీల్ చేశారు చిత్ర బృందం. హీరోగా, విలన్‌గా, ఫ్రెండ్‌గా పలు క్యారెక్టర్స్ చేస్తూ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యాక్టర్ సత్య దేవ్ ఈ సినిమాలో నటిస్తున్న అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

ఈ రోజు సత్య దేవ్ బర్త్‌డే కావడంతో ఆయనకు విష్ చేస్తూ.. ‘తుఫానులాంటి భయంకరమైన వ్యక్తి.. త్వరలో బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాడు.. హ్యాపీ బర్త్‌డే శివ’ అంటూ అతని పాత్రను రివీల్ చేశారు. కాగా.. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న విజయ్ ఈ యాక్షన్ డ్రామాతో హిట్ కొట్టేందుకు వెయిట్ చేస్తున్నాడు. అలాగే.. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా.. విజయ్ ఫ్యాన్స్ కూడా ‘కింగ్‌డమ్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. Link

Next Story