సతీ లీలావతి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.. గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి

by I. Sairam |   (  Updated:2026-02-11 08:28:45  IST  )

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi).

సతీ లీలావతి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.. గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఇక తాతినేని స‌త్య (Satya Tatineni) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రఖ్యాత‌ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ (Durga Devi Pictures) బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

కాగా మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మెగా కోడలు తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ పెట్టింది. లావణ్యం తన ఇన్‌స్టాలో చిన్న వీడియో షేర్ చేస్తూ.. ‘సతీ లీలావతి ప్రమోషన్స్ బిగిన్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.




Next Story