- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన సతీ లీలావతి
సతీ లీలావతి సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో మే 20 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

దిశ, వెబ్ డెస్క్: దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “సతి లీలావతి”. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మే 8న విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక విడుదలైన రెండు వారాల్లోపే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ సొంతం చేసుకుంది. అందులో భాగంగా మే 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. నరేష్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించాడు.






