- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సతీ లీలావతి రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చిలోనే విడుదల కానున్న సినిమా
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi).

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). తాతినేని సత్య (Satya Tatineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ (Durga Devi Pictures) బ్యానర్‌పై నాగమోహన్, రాజేష్.టి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈక్రమంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘కొన్ని కథలు ప్రేమతో మొదలవుతాయి. కొన్ని గందరగోళంతో మొదలవుతాయి. ఇది రెండింటితోనూ మొదలవుతుంది. సతీ లీలావతి మార్చి 6న విడుదలవుతోంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో లావణ్య త్రిపాఠి దేవ్ మోహన్‌ను కుర్చీకు టేప్స్‌తో కట్టేసి అతని ముందు వాకీ టాకీతో నిలబడి అతని వైపు చూస్తూ గట్టిగా అరుస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో మెగా కోడలు గయ్యాళి గంప పెళ్లాంలా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు.






