Satya Raj: థియేటర్స్ లేక వాయిదా పడిన కట్టప్ప మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

స్టార్ డైరెక్టర్ మారుతి (Maruti) సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbaric).

Satya Raj: థియేటర్స్ లేక వాయిదా పడిన కట్టప్ప మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మారుతి (Maruti) సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbaric). వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. ఇందులో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ (Satya Raj) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఆగస్టు 22న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుపుతూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. సరైన రిలీజ్ డేట్, కావాల్సినన్నీ థియేటర్లు లభించడం కోసం.. 22న రిలీజ్ కావాల్సిన మా చిత్రాన్ని వాయిదా వేస్తూ.. ఆగస్టు 29కి పోస్ట్ పోన్ చేస్తున్నాము. ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్టు 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది అంటూ ప్రకటించారు.


Next Story