‘సతీ లీలావతి’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. వెడ్డింగ్ యాంథమ్ వచ్చేస్తుందంటూ క్రేజీ పోస్టర్ రిలీజ్

by I. Sairam |

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

‘సతీ లీలావతి’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. వెడ్డింగ్ యాంథమ్ వచ్చేస్తుందంటూ క్రేజీ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్(Dev Mohan) హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి తాతినేని స‌త్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్‌ బ్యానర్ పై నాగమోహ‌న్ బాబు.ఎమ్‌(M. Mohanbabu), రాజేష్‌.టి(T. Rajesh) నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్టు 12న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఈ సీజన్‌లో అత్యుత్తమ వివాహ గీతానికి సిద్ధంగా ఉండండి.. సతీ లీలావతి మొదటి సింగిల్ — చిత్తూర్ పిల్ల, ఆగస్టు 12న ఉదయం 11:00 గంటలకు విడుదలవుతోంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో లావణ్య అండ్ దేవ్ మోహన్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా రెడీ అయి మండపంలో కూర్చుని ఉన్నారు. అయితే లావణ్య తన నుదుటిని హీరో నుదుటికి ఆనించి సిగ్గుపడుతూ అతని చేతిలో తన చేయి వేసి క్యూట్‌గా స్మైల్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story