‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన నోరా ఫతేహి

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-18 12:27:11  IST  )

అశ్లీల సాహిత్యం వివాదంలో స్టార్ యాక్ట్రస్ నోరా ఫతేహీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమా నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన నోరా ఫతేహి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (Sarke Chunar Teri Sarke) పాట వివాదంపై బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Nora Fatehi) ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా, అశ్లీలంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని, విమర్శలను నోరా సానుకూలంగా తీసుకున్నారు. తన దృష్టికి రాని అభ్యంతరకర అంశాలను ఎత్తిచూపినందుకు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) కోసం చేసిన ఈ పాట హిందీ వెర్షన్ చూసిన తర్వాతే అందులోని సాహిత్యం ఇంత దారుణంగా ఉందనే విషయం తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు. హిందీ పాటలోని సాహిత్యం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, డబుల్ మీనింగ్‌తో ఉండటం చూసి తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే ఆ చిత్రం నుంచి పూర్తిగా తప్పుకోవాలని (Dissociate) నిర్ణయించుకున్నట్లు నోరా స్పష్టం చేశారు. గీత రచయితలు, చిత్ర నిర్మాతలు కంటెంట్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు. భాషా మారి.. అర్థం పూర్తిగా మారిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా, ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాటలో సంజయ్ దత్, నోరా ఫతేహీ నటించిన విషయం తెలిసిందే. అయితే పాటలోని సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉందంటూ ‘ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్’ (AICWA), కర్ణాటక మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతానికి ఆ పాట హిందీ వెర్షన్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేశారు.

ఎఫైర్‍లు, కోరికలు.. త్రిష, నాయనతారపై తమిళనాడులో అశ్లీల రాజకీయం

Next Story