- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సంవత్సరమే థియేటర్లలోకి సర్దార్-2 మూవీ.. ఆకట్టుకుంటున్న పోస్టర్
తమిళ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన 'సర్దార్' (Sardar) సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘సర్దార్-2’(Sardar-2) .

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన 'సర్దార్' (Sardar) సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘సర్దార్-2’(Sardar-2) . దీన్ని ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఇందులో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. అలాగే ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో రిలీజ్ కానున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘సర్ధార్-2 2026లో సినిమా థియేటర్లలో ఒక ఎపిక్ యాక్షన్ రైడ్‌గా దూసుకుపోతుంది.. మీ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది. ఇక పోస్టర్‌లో కార్తీ టూ షేడ్స్‌లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






