- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తెక్కించే చూపులతో సప్తమి గౌడ మాయ.. ఫ్యాన్స్ ఫిదా
సప్తమి గౌడ న్యూ ఫోటోషూట్.. వైరల్ పిక్స్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి సప్తమి గౌడ కన్నడ చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈమె ఆ సినిమాతో పర్వాలేదనే స్థాయిలో గుర్తింపు పొందింది.
అయితే 2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా సప్తమి గౌడకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆమె కెరీర్‌లో ఇది టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
కొంతకాలం క్రితం నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాల్లో సాధారణంగా గ్లామర్‌ను మితంగా ప్రదర్శించే సప్తమి గౌడ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన స్టైలిష్ మరియు గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోతూ, మెడలో భారీ హారం, చెవులకి పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి కిల్లింగ్ లుక్స్‌తో కెమెరాకు పోజులు ఇచ్చింది.
జుట్టును అందంగా వెనక్కి వేసుకుని, చిన్న బొట్టు పెట్టుకొని, చున్నీతో పాటు చున్నీ లేకుండా కూడా విభిన్న స్టైల్స్‌లో స్టిల్స్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఫోటోలలో సప్తమి గౌడ ఎంతో అందంగా కనిపించడంతో అవి నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






