మా సినిమానే మొదటి అడుగు కావాలి.. నాలుగు గోడల మధ్య జరిగే డిస్కస్ ఓపెన్

by Chukka Sudharani |

విక్రాంత్(Vikrant), చాందినీ చౌదరి(Chandini Chowdary) జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu).

మా సినిమానే మొదటి అడుగు కావాలి.. నాలుగు గోడల మధ్య జరిగే డిస్కస్ ఓపెన్
X

దిశ, సినిమా: విక్రాంత్(Vikrant), చాందినీ చౌదరి(Chandini Chowdary) జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సంజీవ్ (Director Sanjeev) మూవీ హైలైట్స్ గురించి తెలిపారు. ‘ఫెర్టిలిటీ ఇష్యూస్ మన సమాజంలో ఉన్నాయి. అయితే మేల్ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటివరకు తెలుగులో మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇలాంటి ఇష్యూస్‌తో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినా, ఆ క్రమంలో వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్ రెడీ చేశాను.

నేను, రైటర్ కల్యాణ్ రాఘవ్ "సంతాన ప్రాప్తిరస్తు" స్క్రిప్ట్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసేలా ఉండాలని డిజైన్ చేశాం. ఎక్కువగా సమస్య గురించి చెబితే ఓవర్ డ్రామా అవుతుంది. అలాగే ఈ కథను చెప్పడంలో కొంచెం హద్దు దాటినా బాగుండదు. అందుకే మేల్ ఫెర్టిలిటీ(Male fertility) ఇష్యూను హ్యూమరస్ గానే చెప్పాలని అనుకున్నాం. మనకు బాలీవుడ్‌లో ఇలాంటి మూవీస్ కొన్ని వచ్చాయి. ఫెర్టిలిటీ (Fertility) ఇష్యూ అనేది ఇది మాట్లాడకూడని అంశం కాదు, సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య. చిన్న సినిమాను మంచి కంటెంట్‌తో చేస్తే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంది. అందుకే మా సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే అంశాన్ని ఓపెన్‌గా డిస్కస్ చేస్తారనే అనుకుంటున్నాం. ఆ మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు మా సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’అన్నారు.

Next Story