- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranthiki Vastunnam : ఈ వయస్సులోనూ తగ్గని వెంకీ మామ క్రేజ్.. రికార్డులు బ్రేక్
విక్టరీ వెంకటేష్(Victory Venktesh) నటించిన "సంక్రాంతికి వస్తున్నాం"(Sankranthiki Vastunnam) భారీ హిట్ ను సొంతం చేసుకొని.. పలు రికార్డులను బ్రేక్(All Time Records) చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్(Victory Venktesh) నటించిన "సంక్రాంతికి వస్తున్నాం"(Sankranthiki Vastunnam) భారీ హిట్ ను సొంతం చేసుకొని.. పలు రికార్డులను బ్రేక్(All Time Records) చేస్తోంది. ఈ సినిమా విడుదలై కేవలం వారం రోజులే అయినప్పటికీ కళ్ళు చెదిరే కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ ఏడు రోజుల కలెక్షన్స్.. రూ.203 వచ్చినట్టు చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియా మూవీ కాకుండానే ఇన్ని వసూళ్లు సాధించడం ఈ సినిమాదే రికార్డ్ గా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం ఈ మూవీలో వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షీ చౌదరి(Meenakshi Chowdary) నటించారు. రిలీజైన రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తోంది ఈ సినిమా. ఆరు పదుల వయస్సులోనూ వెంకటేష్ కు ఇటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ.. అటు మహిళా ప్రేక్షకుల్లోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించబడింది. ఇంకా ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి మరి.






