Sankranthiki Vasthunnam: వెంకీమామ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-15 11:43:41  IST  )

విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam).

Sankranthiki Vasthunnam: వెంకీమామ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్(Naresh), అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas)లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో(Bheem's Cicerolio) సంగీతాన్ని అందించారు. అయితే సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14న) థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.45 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ‘పండ‌గ‌కి వ‌చ్చారు.. పండ‌గ‌ని తెచ్చారు’ అంటూ రాసుకొచ్చిన ఈ క్యాప్షన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంకీ మామ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story