Sankranthiki Vasthunnam: పెద్దోడు సినిమాను చూసిన చిన్నోడు.. ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమా అంటూ ట్వీట్

by I. Sairam |   (  Updated:2025-01-15 13:27:19  IST  )

విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam).

Sankranthiki Vasthunnam: పెద్దోడు సినిమాను చూసిన చిన్నోడు.. ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమా అంటూ ట్వీట్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్(Naresh), అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas)లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో(Bheem's Cicerolio) సంగీతాన్ని అందించారు. అయితే సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14న) థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్, పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమా. వెంకటేష్ సర్ టెర్రఫిక్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న నా డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూసి గర్వంగా ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ క్యారెక్టర్స్‌లో సూపర్‌గా నటించారు.

బుల్లి రాజు(Bulli Raju) పాత్రలో చేసిన ఛైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్‌గా నవ్వించాడు. టీమ్ అందరికీ అభినందనలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు.. చిన్నోడు పెద్దోడి సినిమాకు రివ్యూ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’



(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో వెంకీ పెద్దోడుగా, మహేష్ బాబు చిన్నోడుగా నటించారు.

Next Story