Sankranthiki Vasthunam : సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ.. అదిరిపోయే రేటింగ్ ఇస్తున్న ప్రేక్షకులు

by Phanindra |   (  Updated:2025-01-14 12:20:37  IST  )

జనవరి 14న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజైంది

Sankranthiki Vasthunam : సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ.. అదిరిపోయే రేటింగ్ ఇస్తున్న ప్రేక్షకులు
X

దిశ, వెబ్ డెస్క్ : వెంకటేష్ ( Venkatesh ) హీరోగా తెరకెక్కిన సినిమా " సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam ) సంక్రాంతికి ఫ్యాన్స్ ను అలరించేందకు వెంకీ మామ థియేటర్లలో సందడీ చేసేందుకు వచ్చేశాడు. జనవరి 14న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజైంది. అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్.. ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే విడుదలైన అయిన ట్రైలర్‌తో భారీగా అంచనాలు పెరిపోగా.. పాటలు, ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేశారు. మూవీ చూసిన వాళ్లు వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. మరి, వాళ్ళు రివ్యూలు ఎలా ఇచ్చారో ఇక్కడ తెలుసుకుందాం..

వెంకటేశ్‌ నటనతో పాటు ఐశ్వర్య రాజేశ్ నటన సినిమాకి పెద్ద ప్లస్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి ఫేమ్ పృథ్వీ క్యారెక్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంటున్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కూడా సినిమాలో ఒక రోల్ చేసారని , అతని క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌ ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ ఫన్ రైడ్. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్. ప్రతీ ఒక్కర్ని నవ్విస్తుంది. నేను 3.75/5 రేటింగ్ ఇస్తాను. బొమ్మ హిట్టు.. బ్లాక్ బస్టర్. హాయ్‌కి కొత్త అర్థం అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Next Story