గ్రాండ్‌ సక్సెస్‌తో అక్కడ ప్రత్యక్ష్యమైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రబృందం

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-19 08:53:54  IST  )

విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam Movie) చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది.

గ్రాండ్‌ సక్సెస్‌తో అక్కడ ప్రత్యక్ష్యమైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రబృందం
X

దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam Movie) చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది. ఆదివారం నిర్మాత దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi), హీరోయిన్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా, జనవరి 14వ తేదీన విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల గ్రాస్ రాబట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలించింది.

సంక్రాంతి పండుగపూట పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో వెంకటేష్ కెరీర్‌లో హైయ్యేస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్లు, ఈ సమయంలోనే 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక నాలుగో రోజు రూ.16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శనివారం కలెక్షన్లతో కలిపి ప్రపంచం వ్యాప్తంగా రూ.160 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Next Story