- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sankranthi Winner: సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేసిన ఆడియెన్స్.. ఈ సారి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్న హీరో అతనే?

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer) మూవీ జనవరి 10 న విడుదలయ్యి మిక్డ్స్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమాకి మొదటి రోజు రూ. 186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం తెలిపింది. ఇక, ఈ రోజు బాలకృష్ట ( Bala Krishna) హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj )మూవీ థియేటర్లలో సందడీ చేస్తుంది. ఫస్ట్ షో నే హిట్ టాక్ తెచ్చుకుని సినిమా దూసుకెళ్తుంది.
'గేమ్ ఛేంజర్' మూవీ కలెక్షన్లపై 'డాకు మహారాజ్' ప్రభావం కచ్చితంగా చూపుతుంది. 'గేమ్ ఛేంజర్' మూవీ కొందరికీ నచ్చితే, మరి కొందరికీ ఇంకా బాగా తీసి ఉంటే బావుండేదని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీకి సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఫీవర్ కూడా పట్టుకోవడం వలన యావరేజ్ అని పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి.
"డాకు మహారాజ్ ' మూవీ బడ్జెట్ 'గేమ్ ఛేంజర్' తో పోలిస్తే చాలా చాలా తక్కువ. వెంకీ మామ ( Venkatesh ) 'సంక్రాంతికి వస్తున్నాం' ( Sankranthiki Vasthunam) మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లే అవకాశం ఉంది. వెంకటేష్ సినిమా హిట్ అయినా 'డాకు మహారాజ్' మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి పండుగకు మాస్ ఎంటర్టైనర్ చూడాలంటే 'డాకు మహారాజ్' బెస్ట్, 2025 సంక్రాంతి విన్నర్ కూడా బాలయ్య అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.






