- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘44 సంవత్సరాలు గడిచిపోయి ఉండవచ్చు కానీ కొడుకు ప్రేమ ఎప్పటికీ తగ్గదు’.. స్టార్ నటుడు ఎమోషనల్ పోస్ట్
నటుడు సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ హీరో తల్లిపైనున్న ప్రేమను తెలియజేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే తల్లి నర్గీస్ దత్‌ను సంజయ్ దత్ ఎంతలా మిస్ అవుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ‘‘నువ్వు ఇక్కడ లేకపోవచ్చు, కానీ నీ ప్రేమ ఎప్పుడూ వదల్లేదు, ప్రతిరోజు నిన్ను మిస్ అవుతున్నాను అమ్మా’’ అని ఎమోషనల్ వ్యాఖ్యలు జోడించారు. అంతేకాకుండా చిత్రాలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇకపోతే ఈ హీరో అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచేశారు. చాలా రీమేక్ చిత్రాల్లో నటించి జనాల్ని మెప్పించారు. సంజయ్ దత్ చేసినవాటితో సౌత్ రీమేక్ మూవీస్ కూడా ఉన్నాయి. 1992 లో రిలీజ్ అయిన సంజయ్ దత్ మూవీ జీనా మర్నా తేరే సంగ్ కన్నడ చిత్రం ప్రేమ్ పర్వ్ కి రీమేక్. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
తర్వాత 2003 లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పోలీస్ గిరి మూవీ కూడా రీమేక్ చేశారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్టాప్ టాక్ సొంతం చేసుకుంది. వీటితో పాటుగా ప్రస్థానం, జంజీర్ మూవీ, 2010 లో వచ్చిన సన్ ఆఫ్ సర్ధార్ మూవీ(మర్యాద రామన్నకు రీమేక్) వంటి అనేక చిత్రాల్లో చేశారు.






