సందీప్ రెడ్డి వంగతో గొడవ .. దీపిక అఫిషియల్ సమాధానమిదే.. నేను అడిగింది ఇవ్వాల్సిందే.. నా ట్రాక్ రికార్డ్ తెలుసుగా.. (వీడియో)

by Sujitha Rachapalli |

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ-దీపికా పదుకొణే గొడవ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పనికిరాని పీఆర్ స్టంట్స్ వేసిందని సినిమా లవర్స్ గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే బాలీవుడ్ మీడియా

సందీప్ రెడ్డి వంగతో గొడవ .. దీపిక అఫిషియల్ సమాధానమిదే.. నేను అడిగింది ఇవ్వాల్సిందే.. నా ట్రాక్ రికార్డ్ తెలుసుగా.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ-దీపికా పదుకొణే గొడవ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పనికిరాని పీఆర్ స్టంట్స్ వేసిందని సినిమా లవర్స్ గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే బాలీవుడ్ మీడియా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియోను వైరల్ చేస్తోంది. డైరెక్టర్‌కు దీపిక అఫిషియల్ సమాధానం ఇదేనంటూ +క్లిపింగ్ రిలీజ్ చేసింది. అసలు ఇందులో ఏముంది? ఏం మాట్లాడింది? అసలు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది? చూద్దాం.

‘స్పిరిట్’ హీరోయిన్‌గా, ప్రభాస్‌కు జోడీగా దీపికను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ముందుగా అడిగిన రెమ్యూనరేషన్‌కు ఓకే చేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ, డెలివరీతో బిజీ అయిపోయింది. సెట్ అయ్యాక షూట్ చేద్దామనే టైంకి 40 కోట్ల రెమ్యూనరేషన్, ప్రాఫిట్ షేర్, నచ్చిన వర్కింగ్ హవర్స్ కండిషన్స్‌తో విసిగిపోయిన మేకర్స్.. ఆమెను తీసేశారు. త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇది నచ్చని హీరోయిన్ పీఆర్ స్టంట్స్ స్టార్ట్ చేసింది. కథే బాగాలేదని చెప్పేసింది. దీంతో సందీప్ రెడ్డి ఫైర్ అయ్యాడు.

అయితే దీనిపై దీపిక అఫిషియల్ ఆన్సర్ ఇదే అంటూ ఆరు సంవత్సరాల కిందటి వీడియోను వైరల్ చేస్తుంది బాలీవుడ్ మీడియా. ‘నేను ఒక సినిమా కమిట్ అయ్యా. క్రియేటివిటీ పరంగా ఓకే అనుకున్నా. నాకు కావాల్సిన మనీ డిమాండ్ చేశా. కానీ డైరెక్టర్ హీరోకు మేము ఇంత ఇస్తున్నాం. కాబట్టి మీకు ఇవ్వలేం అని చెప్పాడు. దీంతో దట్స్ ఓకే బైబై టాటా అని చెప్పేశా. ఎందుకంటే నాకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు. నా వాల్యూ తెలుసు. అలాంటప్పుడు నా అర్హతను తగ్గించుకుని సినిమా చేస్తే నిద్రలేని రోజులు గడపాల్సి వస్తుంది’ అని తెలిపింది దీపిక.

Next Story