- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంబాల మేకర్స్‌తో సందీప్ కిషన్.. పోస్టర్‌తోనే హైప్ పెంచారు!
‘శంబాల’ దర్శక, నిర్మాతలతో సందీప్ కిషన్ తన 33వ సినిమాను చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్, ‘శంబాల’ మేకర్స్‌తో చేతులు కలిపారు. ‘శంబాల’ చిత్ర దర్శకుడు యుగంధర్ మునితో ఆయన తన 33వ సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాను SK 33 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో టైటిల్‌తో పాటు ఒక కత్తి కనిపించగా, చిన్న ఒడ్డుపై బుట్టలో పడుకున్న పాపను ఒక సింహం చూస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. ఈ విజువల్స్‌ను బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి అడ్వెంచర్ నేపథ్యంలో సాగే సినిమా అని స్పష్టమవుతోంది. ‘శంబాల’ తర్వాత కూడా యుగంధర్ ముని మరో విభిన్న కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని ‘శంబాల’ను నిర్మించిన శైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సందీప్ కిషన్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.






