పెద్ది: ఫైనల్ ఎడిట్ లాక్‌డ్.. గుడ్ న్యూస్ చెప్పిన మూవీ యూనిట్

by Pulgam srinivas |

తాజాగా పెద్ది చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఎడిట్ లాక్ అయినట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

పెద్ది: ఫైనల్ ఎడిట్ లాక్‌డ్.. గుడ్ న్యూస్ చెప్పిన మూవీ యూనిట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా ముగిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఎడిట్ లాక్ అయినట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే జూన్ 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్న ఈ సినిమాకు ముందు రోజు అంటే జూన్ 3న పెద్ద ఎత్తున ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ అప్డేట్స్‌తో మూవీ యూనిట్ ఫుల్ జోష్‌లో ఉండగా, మెగా అభిమానులు కూడా భారీ స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యాంధు, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.




Next Story