ఎంత ఓపికగా ఉందామన్నా.. రోజుకు ఒకటి తప్పడం లేదు.. సందీప్ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-02-08 13:13:55  IST  )

యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు్న్నాడు.

ఎంత ఓపికగా ఉందామన్నా.. రోజుకు ఒకటి తప్పడం లేదు.. సందీప్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఇందులో రీతు వర్మ(Ritu Verma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్స్ రావు రమేష్(Rao Ramesh), అన్షు (Anshu)కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్నాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.

ఇక ‘మజాకా’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెన్సాన్స్ రాగా.. ప్రేక్షకుల్లో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే జోష్‌లో తాజాగా సినిమా రిలీజ్ అప్‌డేట్ కూడా ఇచ్చారు చిత్ర బృందం. ఈ శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా ‘మజాకా’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ రిలీజ్‌పై హీరో సందీప్ కిషన్ స్పందిస్తూ మరో అప్‌డేట్ ఇచ్చారు. ‘ఎంత ఓపికగా ఉందాము అన్నా.. రోజుకి ఒక యుద్ధం.. లోల్ చాలెంజ్ అంగీకరించబడింది. శివుని ఆశీస్సులతో మీకు నా బిగ్గెస్ట్ హిట్ ఇస్తానని వాగ్దానం చేస్తూ మహాశివరాత్రి 26 ఫిబ్రవరి న కలుద్దాం. అలాగే.. ఫిబ్రవరి 10న ‘బేబీబా’ అనే ఛార్ట్‌బస్టర్ పాటను మీకు వాగ్దానం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతోంది.

Next Story