- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సేతుపతి- పూరి జగన్నాథ్ సినిమాలో శాండల్‌వుడ్ డైనమో యాక్టర్.. అధికారిక ప్రకటన విడుదల
పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, స్టార్ హీరోయిన్ ఛార్మీ కౌర్(Charmi Kaur) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు, రాధికా ఆప్టే(Radhika Apte) కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో శాండల్‌వుడ్ డైనమో యాక్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో విజయ్ కుమార్ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే విద్యుద్దీకరణ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఆయనకు స్వాగతం పలుకుతూ పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కర్ణాటక భూమి నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఆయనతో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు.






