Samyuktha : ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో సంయుక్త.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

వెంకటేష్ నటించిన ‘చింతకాయల రవి’ ఫేమ్ డైరెక్టర్ యోగి.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీని తీయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Samyuktha : ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో సంయుక్త.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: వెంకటేష్ నటించిన ‘చింతకాయల రవి’ ఫేమ్ డైరెక్టర్ యోగి.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీని తీయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. హస్యమూవీస్ అండ్ మాగంటిపిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్-6గా రాబోతున్న ఈ మూవీకి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తుండగా.. దీపావళి స్పెషల్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతున్నట్లు ప్రకటించారు.

ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంయుక్త క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఫస్ట్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ప్రజెంట్ సంయుక్త చేతిలో అఖండ 2, స్వయం భూ, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో పాటు.. పూరిసేతుపతి ప్రాజెక్టు కూడా ఉండగా.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story