- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది వరల్డ్‌లోకి సంయుక్త మీనన్
పెద్ది చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో సంయుక్త మీనన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్‌ను మినహాయిస్తే, మొత్తం షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌లో ఏ హీరోయిన్ నటించబోతుందనే విషయంపై ఇప్పటికే అనేకమంది హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అన్ని అనుకూలంగా జరిగితే ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యాంధు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.






