బాల‌య్యకు కోపం ఎక్కువే...? సంయుక్త మీన‌న్ షాకింగ్ కామెంట్స్‌

by velandi.Saikiran |

నందమూరి బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో కూడా వాటికి సంబంధించిన వీడియోలు

బాల‌య్యకు కోపం ఎక్కువే...? సంయుక్త మీన‌న్ షాకింగ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అయితే ఈ నేపథ్యంలో ఓ హిందీ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నందమూరి బాలయ్య క్యారెక్టర్ పై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలామంది నందమూరి బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో కూడా వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని సంయుక్త మీన‌న్‌ తేల్చి చెప్పారు. బాలకృష్ణకు అసలు కోపమే రాదని క్లారిటీ ఇచ్చారు సంయుక్త మీనన్. ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. అఖండ 2 కథలో కీలక మలుపు తిప్పే పాత్ర తనకు వచ్చినట్లు సంయుక్త మీనన్ స్పష్టం చేశారు.

ఈ సినిమా అంచనాలకు మించి ఉండబోతుందని, థియేటర్ లో బాక్సులు బద్దలు కావడం గ్యారెంటీ అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం పక్కా అంటూ వ్యాఖ్యానించారు. దర్శకుడు బోయపాటి శ్రీను గ్రేట్ విజన్ తో ఈ సినిమా చేసినట్లు తెలిపారు. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరిశారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డిసెంబర్ 4వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.

Next Story